Saturday, November 8, 2008

బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ని అమ్మేస్తారంట

ఇది కేవలం సరదాగా రాసింది మాత్రమే. ఒక మిత్రుడు నాకు పంపిస్తే అది నాకు బాగా నచ్చి నేను దాన్ని తెలుగు లో కి అనువదించి మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించండి. పోస్ట్ చేసే ముందు మాత్రమే తెలిసింది ఇది ఇంతకు ముందే చాలా మంది చూశారని అయినా మీరు ఇప్పటికే చూసి వుంటే మళ్ళీ ఆనందించండి, ఇదే మొదటిసారి అయితే ఎక్కువ ఆనందించండి.
పంజాబ్ కు చెందిన ఒక సింగు గారు కొత్తగా ఒక కంప్యూటర్ కొన్నారు. ఆయన గారికి కొన్ని సందేహాలు వున్నాయి. అవి తీర్చుకోవటానికి ఆయన బిల్ గేట్స్ కి లెటర్ రాశారు. అది ఎలా వుంటుందో చూద్దాం.
విషయం : నా కొత్త కంప్యూటర్ తో ఇబ్బందులు
ప్రియమైన బిల్ గేట్స్ గారూ,
మేము మా ఇంట్లో వాడుకోవటం కొరకు ఒక కొత్త కంప్యూటర్ కొన్నాము. దానితో మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాము. ఇది మీకు తెలియజేయాలని ఈ లెటర్ రాస్తున్నాను.
1. దీంట్లో START వుంది కాని STOP లేదు. ఈ విషయం పరిశీలించవలసిందిగా మనవి.

2. మా ఇంట్లో మాకు ఒక స్కూటర్ వుంది కాని సైకిల్ లేదు. కాని కంప్యూటర్ లో RE CYCLE వుంది. కాబట్టి దీంట్లో RE SCOOTER ఏర్పాటు చెయ్యవలసిందిగా మనవి.

3. దీంట్లో FIND బటన్ వుంది కాని అది సరిగ్గా పని చెయ్యటం లేదు. ఎందుకంటే మా ఆవిడ మా డోరు తాళం చెవి పారేసింది. ఆ తాళం చెవి ఎక్కడ వుంది అనే విషయం FIND కనిపెట్టలేకపోయింది. కాబట్టి ఇది సరిచెయ్యవలసింది.

4. మా పిల్లలు MICROSOFT WORD నేర్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు MICROSOFT SCENTENSE నేర్చుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు అది మా కంప్యూటర్ లో పెడతారో తెలియజేయగలరు.

5. నేను కంప్యూటర్ కొన్నప్పుడు నాకు CPU, MOUSE, KEY BOARD ఇచ్చారు. కాని దీంట్లో MY COMPUTER ఒక్కటే వుంది. మిగతావి ఎప్పుడు పెడతారు?

6. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కంప్యూటర్ లో MY PICTURES అని వుంది కాని దాంట్లో నాది ఒక్క ఫొటో కూడా లేదు. మరి నా ఫొటో ఎప్పుడు పెడతారు?

7. దీంట్లో MICROSOFT OFFICE వుంది. నేను నా కంప్యూటర్ ని ఇంట్లో వాడుతున్నాను. మరి MICROSOFT HOME గురించిన సంగతేమిటి?

8. మీరు MY RECENT DOCUMENTS ఇచ్చారు. మరి MY PAST DOCUMENTS ఎప్పుడు పెడతారు?

9. మీరు దీంట్లో MY NETWORK PLACES పెట్టారు. కాని దయచేసి MY SECRET PLACES పెట్టకండి. ఎందుకంటే నేను నా ఆఫీసు సమయం తరువాత ఎక్కడికి వెళ్ళేదీ నా భార్య కి తెలియకూడదు.
ఇట్లు
సింగు - పంజాబ్

చివరగా ఒక సందేహంమీ పేరు లో GATES కదా వుంది మరి మీరు WINDOWS ఎందుకు అమ్ముతున్నట్టు ?

Saturday, November 1, 2008

ఎంత కాలానికో ఒక గుర్తింపు

తెలుగు భాష కు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయించటం హర్షణీయం.
సుమారు 25 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ద్వారా మనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావటం అందరికీ తెలిసిన విషయమే. ఏనాడో తమిళులు సాధించిన దాన్ని ఇన్నాళ్ళకైనా మనం పొందటం ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆ మహనీయుడ్ని తల్చుకోవటం ఎంతైనా సందర్భోచితం.
మన రాజకీయ నాయకులు తమ అపార రాజకీయ చాతుర్యాన్ని వుపయోగించి ఈ సందర్భంగా వచ్చే 100 కోట్ల నిధుల్ని దారి మల్లించకుండా వుంటే చాలు మన భాష అభివ్రుద్ధి సాధిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం అవసరంలేదు.
దేశం లో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష అయిన మన తెలుగు భాషని ఇకనైనా కాపాడుకుందాం.
జై తెలుగు తల్లీ

ఇదే నా మొదటి బ్లాగు లేఖ

హెల్లో మిత్రులారా
ఈనాడు పుణ్యమా అని ఒక కొత్త బ్లాగ్ నా పేరు మీద ఒపెన్ చేశాను. వీలు చూసుకుని సాధ్యమైనంత సమాచారం ఇందులో post చెయ్యటానికి ప్రయత్నిస్తా. ఏ మాత్రం మొహమాటం లేకుండా నా అభిప్రాయాల్ని మీ ముందు వుంచటానికి ప్రయత్నిస్తా.
ఇందులో వీలైనన్ని ఎక్కువ విషయాలు వుంచటానికి ప్రయత్నిస్తా. ముఖ్యంగా ఇందులో ఎక్కువ భాగం తెలుగు లిపి వాడటం జరుగుతుంది.
మీ విలువైన అభిప్రాయాలు నాకు రాస్తారని ఆశిస్తూ . . . . .
మీ గొట్టిపాటి నాని